నేడు తెలంగాణ గవర్నర్ తో భారత రాష్ట సమితి నేతలు భేటీ కానున్నారు. రాజ్‌భవన్ లో ఆయనను కలసి రాష్ట్రంలో జరుగుుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి తమ పార్టీలో చేర్చుకుంటుంకుంటున్నారని, తమ కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వారిని భయపెట్టేందుకు సంబంధిత శాఖలను ఉపయోగించి బెదిరించారని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు.
ఇటీవల పెద్ద మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆస్తులను కాపాడుకునేందుకు అధికార పార్టీ అయినా కాంగ్రెస్ లో చేరుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్‌లోకి లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. ఎవరు అయితే కాంగ్రెస్ కండువా కప్పారో వారి ఫొటోలు, వీడియోల ఆధారాలను బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు సమర్పించనున్నారు. అనంతరం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునేలా గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. ఈ కార్యక్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు.