కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తాము, కార్యకర్తలం ఎంతో కష్టపడితే ఇప్పుడు నోటికాడి పళ్లెం లాక్కున్నట్లుగా తమ పరిస్థితి మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాతవారిని పక్కన పెట్టడం సరికాదని పార్టీ పెద్దలకు సూచించారు. తాము ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు పదేళ్లు సర్వశక్తులు ఒడ్డారన్నారు.

ముఖ్యమంత్రికి జీవన్ రెడ్డి లేఖ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిషన్‌పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. హైకోర్టు సూచనలకు అనుగుణంగా ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలపై సేకరించిన అంశాలు బీసీలకు ఎంతగానో ఉయోగపడతాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *