Komatireddy Raj Gopal Reddy Slams Cm Revanth: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మరోసారి తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తూ, సామాజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాలని పేర్కొన్నారు. నిబద్ధతతో పనిచేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులకు ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలని చెప్పడం విభజించిపాలించే కుట్రగా అభివర్ణించారు. ఇలాంటి కుటిల ప్రయత్నాలను తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియా జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జర్నలిజం నిర్వచనం మారిందంటూ, ఎవరి పడితే వారు జర్నలిస్ట్‌గా అభ్యర్థించుకుంటున్నారని విమర్శించారు. ప్రాథమిక అర్హతలు లేకుండా కొంతమంది జర్నలిజం ముసుగులో అసభ్య పదజాలాన్ని వినిపిస్తుంటారని ఆరోపించారు. ప్రజాప్రతినిధిగా ఉండే హోదా అడ్డం పడకపోతే కొందరికి చెంప పెట్టాలని కూడా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు రేగాయి.
Internal Links:
బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది..
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ..
External Links:
తెలంగాణ సమాజం సహించదు.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై రాజగోపాల్‌రెడ్డి కౌంటర్!