News5am, Latest Telugu News ( 02/05/2025) : ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా పునఃప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే రాజధాని పరిసరాల రైతులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినవారితో నగరం జనసంద్రంగా మారింది. ఉత్సాహభరితంగా విచ్చేసిన ప్రజలతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద గ్యాలరీలు తక్షణమే నిండిపోవడం ప్రజల ఆశక్తిని ప్రతిబింబించింది. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు వేదికను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. నృత్యాలు, గాన ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ పునఃప్రారంభ కార్యక్రమం అమరావతికి ప్రజల బలమైన మద్దతును స్పష్టంగా తెలియజేసింది.