మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం, తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆయా గ్రూపుల్లో మొత్తం 172 మంది మహిళలను గుర్తించి, వారికి గ్రూపుల వారీగా, విడివిడిగా బ్యాంకు అకౌంట్లు కూడా ఓపెన్ చేయించినట్లు సమాచారం.
ఇతర వృత్తుల వారికి వడ్డీలేని రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మారిన కుటుంబాల పిల్లలను గుర్తించి సమీపంలోని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 159 మంది చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలోని పాఠశాలల్లో మొత్తం 37 మంది పిల్లలు చేరినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గురుకులాల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. వారం రోజుల్లో దాదాపు అందరినీ స్కూళ్లలో జాయిన్ చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.