Revanth Reddy Attended to Indiramma Housewarming: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం (సెప్టెంబర్ 03) సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేయనున్నారు. మొత్తం 310 ఇండ్లు మంజూరు కాగా, 173 ఇండ్లకు మార్కింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం 58 ఇండ్లు స్లాబ్ దశలో ఉండగా, 25 ఇండ్లు దాదాపుగా పూర్తయ్యాయి. గృహప్రవేశాల కోసం పైలాన్ నిర్మాణం కూడా పూర్తయింది. ఈ కార్యక్రమం తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మధ్యాహ్నం 2.20 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దామరచర్ల హెలీప్యాడ్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బెండాలపాడు వెళ్తారు. 2.35 నుంచి 2.50 మధ్య లబ్ధిదారుల చేత గృహప్రవేశం చేయిస్తారు. అనంతరం పైలాన్ ఆవిష్కరించి, సాయంత్రం 3.15 నుంచి 4.15 వరకు దామరచర్లలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సభ నుంచే స్థానిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
Internal Links:
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
External Links:
ఇవ్వాళ (సెప్టెంబర్ 03) బెండాలపాడులో.. ఇందిరమ్మ గృహప్రవేశాలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి