రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 30న రైతు భరోసా సాధన దీక్ష చేపట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నర నెలల తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ప్రజలను మోసం చేసిందన్నారు. 6 హామీలు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్‌రెడ్డి చెప్పినా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ సగం మందికి చేయలేదన్నారు. రాహుల్ గాంధీ రైతు ప్రకటన చేశారు. రుణమాఫీపై రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ జరగలేదని మంత్రులు అన్నారు.
మీకు, మంత్రుల మధ్య ఉన్న గ్యాబ్ తెలుస్తుందన్నారు. రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు… కమిటీ రిపోర్ట్ బయట పెట్టడం లేదన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. ఉపాధి హామీ కూలీలను, కౌలు రైతులను మోసం చేశారన్నారు. వడ్లకి బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని ఉత్తం కుమార్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. సన్న వడ్ల కు మార్కెట్ లో ఎక్కువ ధర ఉన్నది.. మీకు ఎవరు ఇవ్వరన్నారు. బోనస్ అనేది బోగస్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ మెడలు వంచుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో ఈ నెల 30 న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష చేపడతామన్నారు. ఎమ్మెల్యే లు ఎంపి లు దీక్ష లో పాల్గొంటారని తెలిపారు.