త్వరలో నేతన్నల రూ. 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్క సంతకంతో 30 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్నారు. నాంపల్లి లలిత కళాతోరణంలో ఐఐహెచ్‌టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ)ని రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలాది మంది నేతన్నలను కలవడం ఆనందంగా ఉందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చినా బకాయిలు చెల్లించలేదని సీఎం రేవంత్‌ అన్నారు. అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు చెల్లించి సిరిసిల్ల నేతలను ఆదుకున్నామన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటం చేసింది తప్ప నేతన్నలను ఆదుకోలేదని విమర్శించారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. కొడంగల్లో తన గెలుపులో నేతన్నల పాత్ర ఉందని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులే నేతన్నలు అని అన్నారు.

మహిళా సంఘాల సభ్యులకు ఏడాదిలో రెండు నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తామని రేవంత్ తెలిపారు. ఐఐహెచ్‌టీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని రేవంత్ అన్నారు. ప్రధాని మోదీని కలిసి ఐఐహెచ్టీ అవసరంపై వివరించామని, రాజకీయాలకు అతీతంగా కేంద్రం ఐఐహెచ్టీ మంజూరు చేసిందన్నారు. ఐఐహెచ్‌టీ విద్యార్థులకు నెలకు రూ.2500 ప్రోత్సాహకం అందజేస్తామని రేవంత్ తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ నైపుణ్యత లేదన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *