News5am, Telugu Latest News (07-06-2025): కాళేశ్వరం కమిషన్ విచారణలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఆర్థికశాఖతో సమన్వయం చేసుకొని తీసుకొచ్చామని చెప్పారు. ఈటల చెప్పినట్లు ఆర్థికశాఖకు సంబంధం లేదనడం సరికాదన్నారు. ఈటలకు కొన్ని విషయాలు గుర్తు ఉండకపోవచ్చన్నారు. ప్రాజెక్ట్ కోసం ఏర్పాటైన సబ్ కమిటీలో తానే కాక ఈటల, తుమ్మల నాగేశ్వరరావు కూడా సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఆ సబ్ కమిటీ రిపోర్ట్‌పై ముగ్గురూ సంతకం చేశారని, అందువల్ల తుమ్మల నాగేశ్వరరావును కూడా విచారణకు పిలవాలని సూచించారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని హరీష్ రావు చెప్పారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు కలిగే నష్టంపై కూడా ప్రజెంటేషన్ ఉంటుందని వెల్లడించారు. బజ్జీలు తినడానికి బెజవాడకి వెళ్లొచ్చు కానీ, సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తన వద్ద ఉన్న మరో డాక్యుమెంట్‌ను కమిషన్ ముందు ఉంచుతానని, వాళ్లు అడిగే అన్ని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు ఇస్తానన్నారు.
More New Telugu News:
Political Latest News:
రాజంపేటలో టీడీపీకి బిగ్ షాక్..
More Telugu Latest News: External Sources
రేవంత్ రెడ్డి బెజవాడ పోయి బజ్జీలు తినొచ్చి.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీతో కుమ్మక్కయ్యాడు