మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. ఈ ప్రపంచ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధానను ఎంపిక చేశారు.
అక్టోబర్ 4న దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, అక్టోబర్ 9న శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లో మాత్రమే జరగనున్నాయి. భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత్‌కు చెందిన ఈ గ్రూప్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యాస్తికా భాటియా (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా చెత్రీ (వికెట్ కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకోర్.
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘ్వీ బిస్త్, ప్రియా మిశ్రా.