Good start against Australia: ఆస్ట్రేలియా విమెన్స్–ఎ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఇండియా విమెన్స్–ఎ జట్టు విజయంతో ప్రారంభించింది. యాస్తికా భాటియా (59) అర్ధసెంచరీతో పాటు, రాధా యాదవ్ (3/45), టిటాస్ సాధూ (2/37), మిన్ను మణి (2/38) బౌలింగ్‌లో రాణించడంతో బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దీంతో సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 47.5 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.
ఆసీస్ తరఫున అనికా లియరాయిడ్ (92), రాచెల్ ట్రెనామన్ (51) మాత్రమే మెరుగైన ప్రదర్శన చేశారు. నికోల్ ఫాల్టమ్ (18), అలీసా హీలీ (14)తో సహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 42 ఓవర్లలో 215/7 చేసి మ్యాచ్‌ను గెలిచింది. యాస్తికా, షెఫాలీ వర్మ (36), ధారా గుజ్జర్ (31) కలిసి 157 పరుగులు జోడించారు. చివర్లో రాఘవి బిస్త్ (25 నాటౌట్), రాధా యాదవ్ (19) వేగంగా ఆడుతూ విజయం అందించారు.
Internal Links:
ఐసీసీ ట్రోఫీ తప్పక గెలుస్తామంటున్న హర్మన్‌ప్రీత్…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 – కౌంట్‌డౌన్ ప్రారంభం!
External Links:
వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా –ఎ జట్టుపై ఇండియా విమెన్స్–ఎ టీమ్ బోణీ…