పారిస్ ఒలింపిక్స్‌లో 2024 లో భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టి కాంస్య పతకం సాధించి సగర్వంగా స్వదేశానికి చేరుకుంది.. శనివారం ఉదయం భారత హాకీ జట్టు పారిస్ నుంచి స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అభిమానులు భారీ సంఖ్యలో ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని భారత హాకీ టీంకు విమానాశ్రయంలో అధికారులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, గోల్ కీపర్ శ్రీజేశ్, మాజీ సారథి మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు ఇతర ప్లేయర్లకు మెడలో పూలదండ, రుమాలు వేసి అధికారులు స్వాగతం చెప్పారు. దీంతో జట్టులోని ప్రతి సభ్యుడు, సిబ్బంది ఆనందంగా, ఉల్లాసంగా కనిపించారు. అలాగే కొందరు ఆటగాళ్లు బ్యాండ్ చప్పుళ్లకు హుషారుగా తీన్మార్ డాన్సులు వేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా గురువారం రోజున స్పెయిన్తో జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 2-1 తేడాతో నెగ్గి కాంస్యం దక్కించుకున్న విషయం తెలిసిందే.