పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. పారాలింపిక్స్‌లో ఈవెంట్లో భాగంగా భారత్‌కు చెందిన ఇద్దరు మహిళా పారా షూటర్‌లు అవని లెఖారా, మోనా అగర్వాల్ చెరో పతకం సాధించారు. స్టార్ పారా షూటర్ అవని లెఖారా శుక్రవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గింది. 249.7పాయింట్లతో అవని సత్తా చాటింది. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ గోల్డ్ నెగ్గిన అవని, ఈసారి పారిస్‌లోనూ సత్తా చాటి పసిడి ముద్దాడిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో పారాలింపిక్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గిన రెండో భారత పారా అథ్లెట్‌గా అవని రికార్డు సృష్టించింది.
మరోవైపు ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం ముద్దాడింది. ఈమె 228.7 పాయింట్లు సాధించింది. ఇక సౌత్ కొరియా పారా అథ్లెట్ ,యె లీ 246.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకం కైవసం చేసుకుంది.