భారత యువ మహిళా షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటి ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించే అవకాశం చేజారింది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మనుబాకర్ గురి తప్పింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌లో నాలుగో స్థానంలో మనుబాకర్ నిలిచారు. ఇప్పటికే రెండు పతకాలను సాధించిన మను బాకర్ మూడో పతకాన్ని కూడా సాధిస్తుందని అందరూ భావించిన సమయంలో నిరాశే ఎదురయింది. ఆ తర్వాత మరో షూటర్ సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల మిక్స్‌డ్‌లో కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.