భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ శనివారం, ఆగస్టు 24న దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ చివరిసారిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI సిరీస్‌లో భారత్ తరపున ఆడాడు. అతను శుభ్‌మన్ గిల్ రాకతో తన స్థానాన్ని కోల్పోయాడు. ఈ మేరకు గబ్బర్ ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశాడు.
తన కెరీర్‌లో అభిమానుల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపాడు. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్టు వీడియోలో తెలిపాడు. దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉందన్నారు. ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ చెప్పారు. ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు ఆడారు. 34 టెస్టు మ్యాచ్‌ల్లో ధావన్ 40.61 సగటుతో ఏడు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలతో 2315 పరుగులు చేశాడు. 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేలకుపైగా రన్స్ చేశారు. అందులో 24 సెంచరీలు ఉన్నాయి. ధావన్ ను క్రికెట్ అభిమానులు ముద్దుగా గబ్బర్ అని పిలుచుకుంటారు. రిటైర్మెంట్ ప్రకటనతో ధావన్ ఆటను ఇకపై ఐపీఎల్‌లో మాత్రమే చూసే అవకాశం ఉంది అని అభిమానులు అంటున్నారు.