ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కు స్వర్ణ పతకం లభించింది. కానీ ఈ పతకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ప్రదానం చేయలేదు. వినేష్ స్వగ్రామమైన బలాలి ప్రజలు అభిమానంతో చేయించి ఇచ్చిన పతకం. వినేష్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం బాలాలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. బంగారు పతకం, మెడలో కరెన్సీ నోట్ల దండలు వేసి సన్మానించారు. వంద గ్రాముల అదనపు బరువు కారణంగా, ప్యారిస్ ఒలింపిక్స్‌లో వినేష్‌పై వేటు పడింది. 50 కేజీల విభాగంలో సెమీఫైనల్‌లో విజయం సాధించినా రెజ్లర్‌కు పతకం దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన వినేష్ కు సొంత గ్రామం నుంచి విశేషమైన మద్ధతు లభించింది.

ఒలింపిక్స్ కమిటీ వేటు వేసినప్పటికీ తమ దృష్టిలో వినేష్ స్వర్ణం గెలిచినట్లేనని గ్రామస్తులు చెప్పారు. బంగారు పతకం తయారు చేసి మెడలో వేస్తామని ప్రకటించారు. ఇటీవల వినేష్ ఫోగాట్ పుట్టినరోజు వేడుకల్లో ఆమె బంగారు పతకాన్ని అందుకుంది. ‘నా పోరాటం ముగియలేదు మన దేశంలోని అమ్మాయిల కోసం ఇప్పుడే మొదలైంది. ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు దూరమైనందుకు చాలా బాధపడ్డాను. అయితే, తిరిగి వచ్చాక నాకు దక్కిన మద్దతు చూశాక నేను ఎంతో అదృష్టవంతురాలినని అనిపించింది. ఇప్పుడు అందుకున్న ఈ మెడల్ కంటే నాకు ఏదీ గొప్పది కాదు’ అని బలాలిలో జరిగిన సన్మాన సభలో వినేశ్ ఫోగాట్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *