ప్యారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ వినేశ్ ఫొగాట్ సీఏఎస్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఒలింపిక్స్ నిర్వాహక కమిటీ తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)లో సవాల్ చేయగా, ఆ కోర్టు కూడా ప్రతికూల తీర్పునిచ్చింది. వినేశ్ ఫొగట్ చేసిన సవాల్‌ను కొట్టిపారేసింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. కాస్ అప్పీల్‌ను తిరస్కరించడంతో వినేశ్ ఫొగట్ ఎలాంటి పతకం లేకుండానే స్వదేశం చేరుకుంది. ఈ తీర్పు తీవ్ర నిరాశను నింపింది. రజత పతకం ఇవ్వాలని వినేశ్ చేసిన విజ్ఞప్తిని కాస్ కోర్టు ఆగస్టు 14వ తేదీన తీర్పు ఇచ్చింది’ అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు. ఎన్నో ఆశలతో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన వినేశ్ తన శక్తికి మించి బౌట్‌లో పోరాడినా ఫలితం నిరాశకు గురి చేసింది. ఆఖరి మెట్టులో కూడా ఆమెకు ప్రతికూల ఫలితం రావడంతో వినేశ్ ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. కోర్టు తీర్పుతో భారత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అయితే తాజాగా వినేశ్ ఫోగట్ తన రిటైర్మెంట్ పై శుభవార్త చెప్పింది. తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ లేఖతో స్పందించింది. “నా జట్టుకి , నా తోటి భారతీయులకు మరియు నా కుటుంబానికి, మేము పని చేస్తున్న, సాధించాలనుకున్న లక్ష్యం అసంపూర్తిగా మిగిలిపోయినట్లు అనిపిస్తుంది. ఎప్పుటికీ ఇలా జరగదు. అన్ని విషయాలు ఎప్పుడు ఒకేలా ఉండకపోవచ్చు. నేను 2032 వరకు ఆడగలుగుతాను, నాలో పోరాటం, కుస్తీ ఎప్పుడూ ఉంటుంది.” అని పోస్ట్ లో పేర్కొంది.