పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కిలోల విభాగంలో ఫొగాట్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే బరువు పెరిగినట్లు తేలడంతో పతకంపై ఆశలు గల్లంతయ్యాయి. ఆమెపై అనర్హత వేటు పడింది. భారత జట్టు ఎంత ప్రయత్నించినప్పటికీ, ఈ ఉదయం ఫోగట్ 50 కిలోల కంటే ఎక్కువ బరువు ఉందని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. 50 కిలోల విభాగంలో పోటీ చేసేందుకు అవసరమైన బరువు కంటే 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని, దీంతో అనర్హత వేటు పడుతుందని సంబంధిత వర్గాలు ముందుగా ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈరోజు ఆమె 50 కిలోలకు పైగా ఉన్నట్లు ఒలింపిక్ కమిటీ గుర్తించింది. ఈ రాత్రి ఫైనల్‌లో ఫొగాట్ తలపడుతుంది. కానీ బరువు పెరగడంతో ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ ఆమె పై అనర్హత వేటు వేసింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో ఫోగాట్ 50 కేజీల విభాగంలో అనర్హత వేటు పడిందని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. దయచేసి ఫొగాట్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది. అనర్హత వేటు వార్తను పంచుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *