AI Effect: ఏఐతో ఉద్యోగాలు పోతాయా లేదా కొత్తవివస్తాయా అన్న సందేహం నడుస్తున్న సమయంలో, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారుడు వినోద్ ఖోస్లా, జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో సుమారుగా 80 శాతం రానున్న ఐదేళ్లలో ఏఐ కారణంగా కనుమరుగవుతాయని చెప్పారు. లా నుంచి మెడికల్ వరకు అన్ని రంగాల్లో ఆటోమేషన్ ప్రభావం అధికంగా ఉండబోతుందన్నారు. ఈ నేపథ్యంలో యువత తమ కెరీర్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం కీలకమని సూచించారు. యంత్రాలు మనుషుల సామర్థ్యాలను అధిగమించే దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ వంటి స్కిల్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుందన్నారు.
అలాగే, రానున్న 25 ఏళ్లలో ఏఐ వలన ప్రపంచవ్యాప్తంగా విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలు ఉచితంగా అందుబాటులోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. ఖరీదైన వైద్యం, టాప్ యూనివర్సిటీ స్థాయి విద్యను ఏఐ ద్వారా అందించవచ్చని చెప్పారు. ఉపాధి కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, చిన్న పట్టణాల నుంచే రిమోట్ వర్క్ చేయగల పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఏఐ ఒక శక్తివంతమైన సాధనం అయినప్పటికీ, దానిని ఎలా ఉపయోగించుకోవాలనే నిర్ణయం మన చేతుల్లోనే ఉందని వినోద్ ఖోస్లా వివరించారు.
Internal Links:
ఆపిల్ కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ నియమితులయ్యారు.
AI యుగంలో టెక్కీల తప్పు, 450 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఒక్కరూ సెలెక్ట్ కాలే..
External Links:
ఇదే పచ్చి నిజం.. 5 ఏళ్లలో AI 80 శాతం ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందన్న ఇన్వెస్టర్!