తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి దేవి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే సుందరరాజ స్వామి అవతార ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం శ్రీకృష్ణ ముఖ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. మొదటి రోజు పెద్ద శేషవాహనంపై ఉత్సవ దేవుడు భక్తులను ఆశీర్వదించారు.