ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాదికి మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఏకాదశి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఆ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.
* సనాతన ధర్మంలో ఏకాదశి రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజున మహా విష్ణువును పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది.
* ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారాలు తినకూడదు.
* ఏకాదశి రోజున మహిళలు తల స్నానం చేయాలి.
* గోళ్లు లేదా జుట్టును కత్తిరించకూడదు.
* కుటుంబంలో ఎవరైనా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఇంట్లో విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది. ఇంట్లో ఉల్లి, వెల్లుల్లి వేసిన ఆహారాన్ని వండవద్దు.
* ఏకాదశి నాడు కేవలం ఉతికిన దుస్తులనే ధరించాలి.