నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలోని సంతోషిమాత ఆలయంలో  శ్రీ క్రోధి నామ సంవత్సర జ్యేష్ఠ మాసం పాడ్యమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు అల్లాడి ప్రకాష్ శర్మ తెలిపారు.

ఉదయం ఆలయంలో విశేష ద్రవ్యాలతో అభిషేకం, అలంకరణ, మహిళా భక్తులచే సామూహిక కుంకుమకార్చన ఉద్యాపన, కలశపూజ, డోలారోహణ నిర్వహించారు. శ్రీ లలితా సహస్ర సేవా సమితి సభ్యులు సమిష్టిగా లలితా సహస్ర పారాయణం, లింగాష్టకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మహా మంగళహారతి నిర్వహించారు.

అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలతో పాటు అన్నప్రసాదం పంపిణీ చేశారు. అన్నప్రసాదసేవలో కోతా రేవతి, శ్రీనివాసులు దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో మహతి అమ్మవారి నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మలిపెద్ది భాగమ్మ, పెద్దమరూరు రాజేశ్వరి, రాచర్ల శివ కుమార్, వేణుగోపాలరావు, భక్తులు సరస్వతి, రాజేశ్వరి, జ్యోతి, రమాదేవి, బాలీశ్వరి, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *