తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించిన పలు టిక్కెట్లను నేటి నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లు 24వ తేదీ వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అందులో భాగంగా నేడు ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. - 21న వర్చువల్ సేవా టిక్కెట్లు - 22న వృద్ధులు, వికలాంగులు, శ్రీవాణి దర్శనం టిక్కెట్లు, అంగప్రదక్షణ దర్శనం టిక్కెట్లు - ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు రూ. 300 మరియు 24న వసతి ఎంపికలు అంతేకాకుండా తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జేష్ఠాభిషేక మహోత్సవాలు రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇంకా 22న శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడవాహన సేవ, రాత్రి 7 గంటలకు గరుడవాహనం జరుగనుంది. అధిక డిమాండ్ కారణంగా, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి టిక్కెట్లు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే తరచుగా బుక్ చేయబడతాయి. భగవంతుని దివ్య దర్శనాన్ని వీక్షించే అవకాశం కోసం భక్తులు ముందస్తుగా ప్లాన్ చేసుకొని తమ టిక్కెట్లను పొందాలని సూచించారు.