Breaking Telugu News

News5am, Breaking News Telugu News (05/05/2025) : వేసవి సెలవుల సమయంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో, టీటీడీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సర్వదర్శనం భక్తులు కంపార్ట్‌మెంట్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా నేరుగా స్వామివారి దర్శనం పొందేలా ఏర్పాట్లు చేయబడినాయి. బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేయడం సాధారణ భక్తులకు ఉపశమనం కలిగించింది.

గత ఒక్కరోజులోనే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 27,936 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.35 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా జరుగనున్న నేపథ్యంలో, ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.

More News:

Breaking News Telugu:

తెలంగాణలో రేషన్ పండుగ…

నేడు సోషల్ మీడియాలో ప్రధాని స్పందన…

More Breaking Big News: External Sources

రేపటి నుంచే తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *