News5am, Breaking News Telugu Headlines (26-05-2025): కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చి, త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి నదిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలువురు దంపతులు త్రిగుణాత్మక నదుల సాన్నిధ్యంలో పుణ్యస్నానాలు చేసి ఫలితాన్ని పొందుతున్నారు. తీరం వెంట సైకత లింగాలను ఏర్పాటు చేసి భక్తులు పూజలు చేస్తుండగా, పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించి తీరం పరిపూర్ణంగా మారింది.
ఈ సాయంత్రం 7 గంటలకు త్రివేణి సంగమంలో సప్తహారతులు, చండీ హోమం జరగనున్నాయి. ముగింపు రోజు కావడంతో అధికారులు భారీగా భక్తుల రాకను ఊహించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం పుష్కర స్నానానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతారు. అనంతరం ముగింపు వేడుకల్లో పాల్గొని నవరత్నామాల హారతిని దర్శించనున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, నాగఫణి శర్మలు కార్యక్రమంలో పాల్గొంటారు. భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవటానికి క్యూలైన్లలో నిలుచున్నారు. సరస్వతీ మాత, శుభానందదేవి అమ్మవార్ల దర్శనార్థం లక్షలాది మంది తరలివచ్చి, భక్తి, ఉత్సాహంతో కాళేశ్వరం పుష్కర క్షేత్రంగా విరాజిల్లుతోంది.
More Cultural News Telugu:
Breaking News Telugu Headlines:
సరస్వతీ పుష్కరాలు ఇంకా 4 రోజులే…
తిరుమల తిరుపతి దేవస్థానం సులభ దర్శనం కోసం AI టెక్నాలజీని ఉపయోగించనుంది
More Breaking News Telugu: External Sources
కాళేశ్వరంలో నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు