News5am,Breaking Telugu New (14-05-2025): భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రికుల భద్రతను పరిగణనలోకి తీసుకొని, ఛార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు శనివారం ఉదయం మీడియా ప్రకటనలో వెల్లడించింది. పాక్ నుండి దాడుల ముప్పు ఉన్నందున గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల వద్ద భద్రతను మరింత బలపరిచినట్లు పేర్కొంది. యాత్ర ఎప్పటి వరకు నిలిపివేస్తారు? మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే అంశాలపై త్వరలోనే స్పష్టత ఇస్తామని తెలిపింది.
ఈ సంవత్సరం ఛార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభమైంది. యమునోత్రి, గంగోత్రి ఆలయ తలుపులు అదే రోజున తెరుచుకోగా, కేదార్నాథ్ ధామ్ మే 2న, బద్రీనాథ్ ధామ్ మే 4న ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే యాత్ర అనుమతించారు. హిందూ మత విశ్వాసంలో అత్యంత పవిత్రమైన ఈ యాత్ర, హిమాలయ ప్రాంతంలోని యమునోత్రి నుంచి ప్రారంభమై, గంగోత్రి, కేదార్నాథ్ గుండా సాగి, బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.
More Breaking Telugu News
శ్రీవారి ఆలయం మీదుగా ఐదు విమానాలు..
300 టోర్నీ క్వార్టర్స్‌లో ఆయుష్..