Ganesh Idol Immersion 2025: హైదరాబాద్ నగరం లంబోదరుడి నిమజ్జనోత్సవానికి పూర్తిగా సిద్ధమైంది. జీహెచ్ఎంసీ రూ.54 కోట్లతో మౌలిక వసతులు కల్పించి, హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు 20 ప్రధాన చెరువులు, 74 కృత్రిమ కొలనుల వద్ద ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు లక్షా 50 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఇవాళ ఖైరతాబాద్, బాలాపూర్ గణపతులతో కలిపి మరో 50 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఇందుకోసం 15 వేల సిబ్బందిని, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, 40 పెద్ద క్రేన్లు సిద్ధం చేశారు. ఊరేగింపులు సాఫీగా జరిగేందుకు 160 యాక్షన్ టీమ్‌లు, 56,187 లైట్లు, 3 వేల పారిశుద్ధ్య కార్మికులు, 200 గజ ఈతగాళ్లు, 9 బోట్లు, 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
గణనాథుల ఊరేగింపులు బాలాపూర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, టోలీచౌకీ, ఆసిఫ్‌నగర్ వంటి ప్రాంతాల నుంచి చార్మినార్, లిబర్టీ, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మీదుగా హుస్సేన్ సాగర్‌కు చేరుకుంటాయి. ట్రాఫిక్ రద్దీ నివారణకు రేపు ఉదయం 10 గంటల వరకు ఇతర వాహనాల ప్రవేశం నిషేధించారు. సౌత్, నార్త్, ఈస్ట్, సెంట్రల్ జోన్లలో డైవర్షన్‌లు అమలు చేస్తారు. ఆర్టీసీ బస్సులను కూడా చాదర్‌ఘాట్ వైపు మళ్లిస్తారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచారు.
Internal Links:
క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి..
ఖైరతాబాద్ గణేశుడి దర్శనాలు నేటి అర్ధరాత్రి వరకే..
External Links:
దారులన్నీ సాగరం వైపే… గణేష్ నిమజ్జనం అంటే హైదరాబాదే..