Hyderabad Sri Ram Navami Procession: నేడు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రంలోని రామాలయాలు భక్తులతో నిండిపోయాయి. చాలా ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా జరగనుంది. హైదరాబాద్‌లో కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్, ఆకాశ్‌పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయి.
ట్రాఫిక్ మార్పుల ప్రకారం, సీతారాంబాగ్ బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లిస్తారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు పంపిస్తారు. ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లేవారిని జుమ్మేరాత్ బజార్ మార్గంలో డైవర్ట్ చేస్తారు. అబిడ్స్, సుల్తాన్ బజార్, కోఠి ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేస్తారు. కాబట్టి వాహనదారులు పోలీసులకు సహకరించి, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
నేడు శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!