International Yoga Day: ఈనెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి సవిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొంటూ, మతాలు, కులాలు, ప్రాంతాలు విస్మరించి ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ పాల్గొనాలని సూచించారు. ఆమెతో పాటు విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు యోగాను విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు ఐదు లక్షల మందికి పైగా పాల్గొంటారని చెప్పారు. జీవీఎంసీ తరఫున అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లో సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి కాళీమాత ఆలయం వరకు యోగా వాక్ నిర్వహించగా, విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురు భాగంలో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డీబీవీ స్వామి, సరిత, సత్యకుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి. కృష్ణబాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
International Yoga Day పురస్కరించుకొని అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాల మైదానంలో “యోగాంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో యోగాసనాలు వేశారు. కిమ్స్ కళాశాల చైర్మన్ చైతన్య రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వందలాది మంది వైద్య విద్యార్థులు ఇందులో పాల్గొని యోగాసనాలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Internal Links:
అమీనాపురంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు…
యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధర పెంపు..
External Links:
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు..