Maha Shivaratri Brahmotsavam 2026: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. రేపటి నుంచి ఈ నెల 18 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో భక్తులకు అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. జ్యోతిర్ముడి శివస్వాములకు 12వ తేదీ వరకు నిర్ణిత సమయాల్లో స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 40 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు.
మహా శివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి పెరగనుంది. 13 నుంచి 16 వరకు ఉచిత లడ్డూ అందజేస్తారు. 15, 16 తేదీల్లో టోల్‌గేట్ లేకుండా వాహనాలకు అనుమతి ఉంటుంది. 12న రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాలు, వాహనసేవలకు విస్తృత ఏర్పాట్లు చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
శ్రీశైలంలో రేపటి నుంచే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు