ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క దర్శించుకున్నారు. అంతకుముందు జంపన్న వాగు స్నాన ఘట్టాలు పరిశీలించారు. మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం అని, భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి సీతక్క తెలిపారు.

అనంతరం అధికారులు, మేడారం సమ్మక్క సారలమ్మ పూజరులతో సమావేశమయ్యారు. ఈ నెల 12 నుండి నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు 10 నుండి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి సీతక్క తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా వైద్య సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని అన్నారు. వైద్య శాఖ సిబ్బంది అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయాలలో ఇబ్బందులకు గురయ్యే వారిని జిల్లా కేంద్రానికి తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *