అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ బంధం మరింత బలపడే రోజు, అమ్మ చూపుతున్న ప్రేమకు, నాన్న భద్రతకు అద్దం పడుతోంది. ఆగమనం అంటే పౌర్ణమి. పౌర్ణమి రోజున ధరించే రక్షకు రాఖీ అని పేరు. ఈ రక్షాబంధంలో దాగి ఉండే మూడు దారాలు… మూడు ముడులు… ఆరోగ్యం, ఆయువు, సంపదలకు సంకేతం. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
ఆగస్ట్ నెల వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రాఖీని ఎప్పుడు జరుపుకుంటారు అని తమ క్యాలెండర్‌లను తిప్పుతారు. సంబంధం లేని సోదరీమణులు సోదరులుగా ఉండాలనుకునే పండుగ రాఖీ. ఇది కుల, మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. మీ సోదరులు మరియు సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు, ప్రత్యేక వాట్సాప్ సందేశాలు, పండుగ రోజు రాఖీ శుభాకాంక్షలు మీ తోబుట్టువులతో పంచుకోండి.
అన్నయ్యా.. చిరునవ్వుకి చిరునామానివి..
మంచి మనసుకు మారు రూపానివి..
మమతలకు ప్రాకారానివి..
అప్యాయతకు నిలువెత్తు రూపానివి!!! రక్షాబంధన్ శుభాకాంక్షలు.