తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం ప్రస్తుతం దేశంలో సంచలనంగా మారింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని శ్రీవారిని కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో కొలుస్తారు. చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ,గత వైసీపీ సర్కారు తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడారని బుధవారం సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో ఈ లడ్డు వివాదంపై చర్చ జరుగుతోంది. అయితే, శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో అర్చకులు శాంతి హోమం చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు టీటీడీ శాంతి హోమం నిర్వహించనున్నారు.
ఈ శాంతి హోమం కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. వెంకటేశ్వరుడి లడ్డూ తయారీకి వాడే ఆవు నెయ్యిలో దోషం వల్ల అపచారం కలిగిందని ఈఓ శ్యామలరావు పేర్కొన్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా హోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హోమం ముగిసిన తర్వాత అన్ని పోటుల్లో సంప్రోక్షణ చేస్తామని స్పష్టం చేసారు.