News5am Latest Breaking Today News ( 01/05/2025) : తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఉదయం 5.45 నుంచి 11 గంటల వరకూ వివిధ విభాగాల వారిగా బ్రేక్ దర్శనాలు నిర్వహించనున్నారు. డిప్యూటీ ఈఓ లోకనాథం తెలిపిన వివరాల ప్రకారం, ప్రొటోకాల్, రిఫరెల్, జనరల్ బ్రేక్ దర్శనాలు ఒక్కొక్కటిగా నిర్వహించి, అనంతరం సామాన్య భక్తులకు వీలైనంత ఎక్కువగా దర్శనం కల్పించేలా టీటీడీ ప్రణాళిక సిద్ధం చేసింది.
గురువారం శ్రీవారి తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా ఆ రెండు రోజుల్లో పాత వేళలే అమల్లో ఉంటాయి. బ్రేక్ దర్శనాల షెడ్యూల్ ప్రకారం, ఉదయం 5.45కి ప్రొటోకాల్ దర్శనం ప్రారంభమై, 11 గంటలకు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగుల దర్శనంతో ముగుస్తుంది. భక్తులు ఈ మార్పులను గమనించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Telugu Latest News
Telugu Latest News :
బాను ముష్తాక్ ‘హార్ట్ లాంప్’తో అంతర్జాతీయ తొలి కన్నడ రచన మరియు బుకర్ విజేతగా నిలిచారు..
ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు..
More Latest News : External Sources
శ్రీవారి భక్తులకు అలర్ట్ – వీఐపీ బ్రేక్ దర్శన వేళలు మార్పు…