Temples Reopen: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలు మూతపడ్డాయి. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు కూడా ఆదివారం రాత్రి మూసివేయబడ్డాయి. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. వేదపండితులు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనానికి అనుమతించారు. వేములవాడ రాజన్న ఆలయం సుమారు 10 గంటలపాటు మూసి ఉంచి, తెల్లవారుజామున 3:45కి శుద్ధి చేసి తిరిగి తెరిచారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉదయం 7 గంటలకు యధావిధిగా దర్శనాలు ప్రారంభమయ్యాయి.
అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, బాసర సరస్వతీ దేవాలయం, రామాలయం కూడా గ్రహణం అనంతరం శుద్ధి, సంప్రోక్షణ చేసి తెరిచారు. బాసర అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మూసివేసి, సోమవారం తెల్లవారుజామున ద్వారాలు తెరచి సుప్రభాత సేవ, ఆరాధనా పూజలు చేసి భక్తులకు దర్శనాన్ని ప్రారంభించారు. దాదాపు 10 గంటలపాటు ఆలయాలు మూసివుండడంతో ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు.
Internal Links:
హైదరాబాద్ కొనసాగుతోన్న గణేష్ శోభాయాత్ర..
క్రమంగా పెరుగుతోన్న భక్తుల తాకిడి..
External Links:
తెలంగాణలో తెరుచుకున్న ప్రముఖ దేవాలయాలు.. దర్శనానికి భక్తులకు అనుమతి