TTD

తిరుమల పెద్దజీయర్ స్వామి నేతృత్వంలో ఈ నెల 21న చతుర్మాస దీక్షా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో చతుర్మాస దీక్షలు మొదలవుతాయి. గురు పౌర్ణమి రోజున శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్బంగా సాయంత్రం 7 నుంచి 9 గంటల వరుకు స్వామి వారు గరుడ వాహనం ఫై శోభాయమానంగా తిరుమాడ వీధులలో విహరిస్తారు. ఉత్సవాలను వీక్షించడానికి వచ్చిన భక్తుల సంఖ్య 67,223. భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లో ఉన్న వారికీ టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *