Varalakshmi Vratham 2025: శ్రావణ మాసంలోని శుక్లపక్షం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో భక్తిపూర్వకంగా ఆచరిస్తారు. ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడి, ఇంట్లో ఆనందం, సంపద, శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఉంది. పేదరికం, కష్టాలు తొలగుతాయని పురాణాలు చెబుతాయి. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8న జరగగా, ఆగస్టు 8 సూర్యోదయం నుంచి ఆగస్టు 9 సూర్యోదయం వరకు కొనసాగింది. వివాహిత స్త్రీలు ఉపవాసంతో, నియమ నిష్టలతో పూజలు చేస్తారు. సింహ లగ్నం (ఉ. 6.29–8.46), వృశ్చిక లగ్నం (మ. 1.22–3.41), కుంభ లగ్నం (సా. 7.27–8.54), వృషభ లగ్నం (రా. 11.55–1.50) పూజలకు శుభముగా పరిగణిస్తారు. వీలైనంత వరకు పగటి పూటలో ముహూర్తంలో పూజ చేయడం ఉత్తమం.
వరలక్ష్మీ పూజ దీపావళి మహాలక్ష్మీ పూజలా ఉండే కానీ, ప్రత్యేక నైవేద్యాలు, మంత్రాలు ఉంటాయి. పూజలో కట్టే పవిత్ర దారాన్ని “తోరం” అంటారు. కలశ స్థాపనతో పూజ ప్రారంభమై, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, హారతి, తోరం కట్టడం జరుగుతుంది. నైవేద్యంగా ఎక్కువగా ఆవుపాలతో పరమాన్నం సమర్పిస్తారు. భక్తులు లక్ష్మీదేవి విగ్రహాన్ని పువ్వులు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో అలంకరించి, మంత్రజపంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.
Internal Links:
భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత..
యాదగిరీశుడి కొండ చుట్టూ ‘గిరిప్రదక్షిణ’..
External Links:
నేడు వరలక్ష్మీ వ్రతం.. శుభ ముహూర్తం, పూజ విధానం ఇదే!