ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజలు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దీక్షా కార్యక్రమం ఉంటుందన్నారు. దేవస్థానం చైర్మన్, ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు, భక్తుల సూచనలు, సలహాలతో ఉత్సవాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర పండుగగా ప్రకటించినందున టీటీడీ, ప్రభుత్వం అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తారు.

సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 8 గంటలకు చతురుగాడిలో పండరి రథ, మండల దీక్షతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వనం గుడి వద్ద ఉదయం 11 గంటలకు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10న అర్ధమండల దీక్ష ప్రారంభమై 14న తొలేళ్ల పండుగ, 15న సిరిమానోత్సవం, 22న తెప్పోత్సవం, 27న కలశజ్యోతుల ఊరేగింపు, 29న ఉయ్యాల కంబాల ఉత్సవం, 30న నామ ఉత్సవం. నిర్ణీత సమయానికి పైడితల్లి ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని పెద్ద చెరువు పశ్చిమ ప్రాంతంలో ప్రత్యేక పల్లకిలో ప్రతిష్టిస్తారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన హంసవాహ‌న పడవపై తెప్పోత్సవం నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *