గుంటూరు: కొత్తపేట శివాలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమలపాకులు, వివిధ పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, సహస్ర నామాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి శ్రీ ఆంజనేయ స్వామి వారి కోరికలు నెరవేరాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు తీర్థం, ప్రసాదాలు పంపిణీ చేశారు.
