న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వృద్ధిపై ఆశాజనకంగా ఉంది. మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఎండి, రిధమ్ దేశాయ్, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారత ఆర్థిక వృద్ధిని నడిపించే నిర్మాణాత్మక సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తుందని నొక్కి చెప్పారు.సంకీర్ణ ప్రభుత్వంపై 2014, 2019 మినహా 1989 నుంచి భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయని.. రానున్న ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.