నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు షాకిచ్చాయి. ఈ రోజు బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. శుభకార్యాల వేళ పసిడి ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. పెరుగుతున్న గోల్డ్ ధరలు మగువలకు షాకిస్తున్నాయి. నేడు తులం బంగారంపై రూ. 440 పెరిగింది. ధరలు పెరుగుతుండడంతో బంగారం ఇక అందని ద్రాక్షేనా అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిల్వర్ ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,000, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,250 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరగడంతో రూ. 82,500 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 పెరగడంతో రూ. 90,000 ట్రేడ్ అవుతోంది. కిలో వెండిపై ఏకంగా రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,13,000 వద్ద ట్రేడ్ అవుతోంది.