మగువలకు బంగారం ధరలు భారీ షాకిచ్చాయి. గత 4-5 రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు, నేడు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650, 24 క్యారెట్లపై రూ.710 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఏప్రిల్ 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,900గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,440గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధర ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పతనమై, ఆపై మూడు రోజులు స్థిరంగా ఉన్న వెండి, ఈరోజు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి, రూ.93,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 2 వేలుగా నమోదైంది.