AI Effect: అమెరికా కంప్యూటర్ దిగ్గజం HP మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వచ్చే మూడు సంవత్సరాల్లో 6 వేల ఉద్యోగాలు తగ్గించనున్నట్లు సీఈఓ ఎన్‌రికే లోరెస్ తెలిపారు. ఉత్పత్తి అభివృద్ధి, సంస్థ కార్యకలాపాలు, కస్టమర్ సపోర్ట్ విభాగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు తగ్గించేందుకు, AI వినియోగం పెంచేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో HP షేర్లు 5.5% తగ్గాయి. 2025లో కూడా కంపెనీ 1–2 వేల ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా DRAM, NAND మెమరీ చిప్ ధరలు పెరగడంతో HP, డెల్, ఏసర్ లాంటి కంపెనీలకు లాభం తగ్గుతోంది. AI డిమాండ్ పెరగడం కూడా HPకి ఆర్థిక భారంగా మారింది. 2026 రెండో భాగంలో ఖర్చులు ఇంకా పెరుగుతాయని HP అంచనా వేస్తోంది. ఖర్చులు తగ్గించేందుకు తక్కువ ధరల సరఫరాదారులతో పని చేయడం, మెమరీ స్పెసిఫికేషన్లు తగ్గించడం, డివైజ్ ధరలను సవరించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
AI ఎఫెక్ట్: కంప్యూటర్ల తయారీ దిగ్గజం HPలో భారీ లేఆఫ్స్.. 6 వేల మంది ఇళ్లకే..