దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ తమ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్‌కి చెందిన ఎయిరిండియా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు తమ కస్టమర్ కేర్ సర్వీసులను ప్రాంతీయ భాషలకు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కస్టమర్ సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 7 ప్రాంతీయ భాషల్లో కస్టమర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన జారీ చేసింది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీలో ఎయిరిండియా కస్టమర్ కేర్ సేవలు అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల మొబైల్ నెట్‌వర్క్ ఆధారంగా ఐవీఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ) సిస్టం, వారి భాష ప్రాధాన్యతను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుందని ఎయిరిండియా పేర్కొంది.
ఈ ప్రత్యేక అసిస్టెంట్ సర్వీసులు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అలాగే కొత్తగా 5 కాంటాక్ట్ సెంటర్లనూ ఏర్పాటు చేసినచేసిన విషయం తెలిసిందే. తరుచుగా ఎయిరిండియాలో ప్రయాణించే వారితో పాటు ప్రీమియం కస్టమర్లకు ఈ సేవలు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎయిరిండియాతో ప్రయాణికులందరినీ కలుపుకుపోయేలా చూస్తాం” అని ఎయిరిండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా తెలిపారు.