Apple layoff

Apple layoff: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే విడతలవారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఖర్చులు తగ్గించే వ్యూహంతో ఈ నిర్ణయాలు తీసుకోగా, తాజాగా ఈ జాబితాలోకి యాపిల్ (Apple layoff) కూడా చేరింది.

ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్‌ సమాచారం ప్రకారం, యాపిల్ తన సేల్స్ విభాగంలో ఉద్యోగులను తొలగించేందుకు చర్యలు ప్రారంభించింది. అయితే, ఈ ప్రభావం తక్కువ సంఖ్యలో ఉద్యోగులకే పరిమితం కానుంది. అదే సమయంలో ఇతర విభాగాల్లో నియామకాలు కొనసాగుతాయని తెలుస్తోంది. ఉద్యోగాలు కోల్పోయినవారికి కంపెనీలోని ఇతర విభాగాల్లో పనిచేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు యాపిల్ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదించింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..

External Links:

యాపిల్‌ సేల్స్‌ విభాగంలో ఉద్యోగాల కోత..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *