News5am, Latest Updates in Telugu: (22-05-2025): భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా-చైనా మధ్య టారిఫ్ చర్చలు సానుకూలంగా ముగిశించడం వంటివి సోమవారం భారత స్టాక్ మార్కెట్లకు గట్టి మద్దతిచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు భారీగా ఎగిసాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 3.79 శాతం పెరిగింది, నిఫ్టీ50 కూడా 3.9 శాతం లాభపెట్టింది. అన్ని రంగాల్లో కొనుగోళ్లు జోరందుకోవడంతో మార్కెట్లలో ఉత్సాహం వెల్లివిరిసింది. రికార్డు స్థాయిలో మ్యూచువల్ ఫండ్ల ఇన్ఫ్లోస్ రావడం, భారత్కు సావరిన్ క్రెడిట్ రేటింగ్ అప్గ్రేడ్ లభించడంతో బుల్స్ మరింత జోష్ చూపించారు.
సోమవారం రోజున సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోనే అతిపెద్ద ఒక్కరోజు లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 2,975.43 పాయింట్లు (3.74 శాతం) పెరిగి 82,429.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 916.70 పాయింట్లు (3.82 శాతం) పెరిగి 24,924.70 వద్ద స్థిరపడింది. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.16.15 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.432 లక్షల కోట్లకు (అంటే సుమారు 5.05 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది.
More Latest Telugu Breaking Bulls News:
Latest Updates in Telugu:
డిక్సన్ టెక్నాలజీస్ షేరు ధర 7% పైగా పడిపోయింది
వాణిజ్యంలో భారత స్టాక్ మార్కెట్..
More Latest Bulls High News: External Sources
మార్కెట్లు జూమ్.. భారత్–పాక్ సీజ్ఫైర్తో బుల్స్ జోరు..