News5am, Breaking Latest News Telugu(29-05-2025): పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్న మార్గంలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో బంగారం ధర లక్ష మార్క్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులు తగ్గుముఖం పట్టిన ధరలు, తిరిగి పెరుగుతూ ఇప్పుడు మళ్లీ 98వేల వరకు చేరుకున్నాయి. ఇటీవల 95వేల వరకు తగ్గిన పసిడి ధరలు, ఆపై తిరిగి పెరిగి 98వేల వరకూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం, బంగారం, వెండి ధరల్లో స్వల్పంగా తగ్గుదల చోటు చేసుకుంది. మే 29, 2025 గురువారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.97,470గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,340గా ఉంది. బంగారంపై రూ.10 తగ్గిందని చెబుతున్నారు. వెండిలో కూడా రూ.100 తగ్గుదలతో కిలో ధర రూ.99,900గా ఉంది.
హైదరాబాద్‌లోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,470గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.89,340గా ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే, కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,10,900గా ఉంది.
More News:
Breaking Latest News Telugu
More Breaking Latest News: External Sources
గుడ్ న్యూస్.. తగ్గుతోన్న బంగారం ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే..