News5am, Breaking News Telugu (13-06-2025): మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా మారాయి. చమురు, గ్యాస్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 823 పాయింట్లు పడిపోయి 81,691 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 253 పాయింట్లు నష్టపోయి 24,888 వద్ద ముగిసింది. మొత్తం 27 షేర్లు నష్టపోగా, మూడు మాత్రమే లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5.98 లక్షల కోట్ల మేర నష్టపోయింది. విదేశీ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. టాటా మోటార్స్, టైటాన్, టాటా స్టీల్ లాంటి షేర్లు ఎక్కువ నష్టపోయాయి, అయితే బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్ లాభపడాయి.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.52%, స్మాల్ క్యాప్ 1.38% నష్టపోయాయి. చమురు ధరల పెరుగుదల, వాల్యుయేషన్ భయాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడాన్ని తగ్గించారు. విద్యుత్, గ్యాస్, రియాల్టీ, మెటల్, ఆటో వంటి రంగాల్లో 1.5% కంటే ఎక్కువగా షేర్లు పడిపోయాయి. మొత్తం బీఎస్ఈలో 2,729 స్టాక్‌లు నష్టపోయాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమవడం, ట్రంప్ టారిఫ్ బెదిరింపులు, బోయింగ్ షేర్ల నష్టంతో అమెరికా, యూరప్ మార్కెట్లు నెగటివ్‌గా ట్రేడయ్యాయి. ఆసియా మార్కెట్లలో కొన్నింటి పనితీరు మెరుగుగా ఉన్నా, చాలావాటిలో నష్టాలు నమోదయ్యాయి.
More News Telugu:
Breaking News Telugu:
బ్రోకరేజీలు మెచ్చిన టాప్-5 స్టాక్స్..
256 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
More Breaking News Telugu: External Sources
సెన్సెక్స్ 823 పాయింట్లు డౌన్.. 253 పాయింట్లు తగ్గిన నిఫ్టీ.. ఇన్వెస్టర్లకు రూ.5.98 లక్షల కోట్ల లాస్