News5am, Breaking News Telugu (16-06-2025): ఈ వారం మొత్తం ఆరు ఐపీఓలు మార్కెట్లోకి రానున్నాయి. ఇందులో ఒకటి మెయిన్‌బోర్డ్ ఐపీఓ కాగా, మిగతా ఐదు ఎస్‌ఎంఈ ఐపీఓలు. రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లకు కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ సప్లై చేసే “అరిస్ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్” జూన్ 20న ఐపీఓ తెరిచి, జూన్ 24న ముగించనుంది. షేరు ధర రూ. 210–222 మధ్య ఉండగా, కంపెనీ రూ. 499.6 కోట్లు సేకరించాలనే లక్ష్యంతో ఫ్రెష్ ఇష్యూ చేస్తోంది.
ఎస్సెంఈ విభాగంలో పాటిల్ ఆటోమేషన్ (వెల్డింగ్, లైన్ ఆటోమేషన్ సొల్యూషన్స్), సమయ్ ప్రాజెక్ట్ సర్వీసెస్ (ఈపీసీ సర్వీసెస్) ఐపీఓలు జూన్ 16–18 మధ్య అందుబాటులో ఉంటాయి. పాటిల్ షేరు ధర రూ. 114–120, సమయ్ ధర రూ. 32–34గా నిర్ణయించారు. అప్పెల్‌టోన్ ఇంజనీర్స్ ఐపీఓ జూన్ 17న ప్రారంభమై, షేరు ధర రూ. 125–128 ఉంటుంది. ఇన్‌ఫ్లక్స్ హెల్త్‌టెక్ ఐపీఓ జూన్ 18న ఓపెన్ అయి, 20న ముగుస్తుంది, ధర రూ. 91–96. మాయశీల్ వెంచర్స్ జూన్ 20న ఐపీఓ విడుదల చేయగా, షేరు ధర రూ. 44–47. ఓస్వాల్ పంప్స్ ఐపీఓ జూన్ 17 వరకు ఓపెన్‌లో ఉంటుంది.
More News Telugu:
Today News Telugu:
సెన్సెక్స్ 823 పాయింట్లు డౌన్..
బ్రోకరేజీలు మెచ్చిన టాప్-5 స్టాక్స్..
More Breaking News Telugu: External Sources
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్: ఈ వారం ఆరు ఐపీఓలు ఓపెన్..