News5am, Breaking News Telugu5 (22-05-2025): దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలోనే మే 22, 2025న ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి, బిగ్ షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 1900 పుంజుకుని రూ. 97,430కి చేరింది. 22 క్యారెట్ పసిడి ధర 10 గ్రాములకు రూ. 1750 పెరిగి రూ. 89,310కి చేరుకుంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 97,580కి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,460కు చేరింది.
బంగారంతో పాటు, వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ. 2000 పెరిగి, రూ. 100100కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడలో కిలో వెండి ధర రూ.2100 పెరిగి రూ.111,100కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై, కేరళ ప్రాంతాల్లో కూడా వెండి ధరలు రూ.111,100గా ఉన్నాయి.
More Today Gold Rate Telugu News:
Breaking News Telugu5:
More Today Gold Rate Telugu News: External Sources
భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..